బోయినపల్లిలో ఫ్యానుకు ఉరివేసుకొని మహిళ మృతి

1894చూసినవారు
బోయినపల్లిలో ఫ్యానుకు ఉరివేసుకొని మహిళ మృతి
బోయినపల్లి గ్రామానికి చెందిన 28 ఏళ్ల దొంతరవేణి నర్మద, అదనపు కట్నం కోసం భర్త నరేష్ వేధింపులకు గురై మంగళవారం మధ్యాహ్నం తన పుట్టింట్లో ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్ల క్రితం వివాహం జరిగిన నర్మద, ఇద్దరు పిల్లలకు తల్లి. వివాహం జరిగిన ఏడాది తర్వాత నుంచి రూ. 2 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధించేవాడని, పెద్దల సమక్షంలో రాజీ కుదిరినా వేధింపులు కొనసాగాయని సమాచారం. ఆరు నెలల క్రితం భర్త దుబాయ్ వెళ్లిన తర్వాత కూడా డబ్బుల కోసం వేధింపులు ఆగలేదని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నర్మద ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆమె తండ్రి ఊరుమడ్ల రాజయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దొంతరవేణి నరేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమాకాంత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్