ధర్మపురి పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న లారీ ఓవర్ టెక్ చేస్తూ, ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టి, పక్కనే వెళ్తున్న ఆటోను డీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో బోల్తా పడి ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు హనుమాన్ భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.