వీర్నపల్లి మండల శివారులోని మద్దిమల్ల రోడ్డుపై ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు సోమవారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఉమ్మడి మద్దిమల్ల గ్రామానికి చెందిన మాలోతు హరిదాసు, బట్టు వెంకటేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అనిల్, విక్రమ్ ఘటనా స్థలానికి చేరుకుని, ప్రాథమిక చికిత్స అనంతరం గాయపడిన వారిని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది సకాలంలో స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారని గ్రామస్తులు, బాధితుల కుటుంబ సభ్యులు అభినందించారు.