ధర్మపురి: బావిలో పడి 3 సంవత్సరాల బాలుడు మృతి

553చూసినవారు
ధర్మపురి: బావిలో పడి 3 సంవత్సరాల బాలుడు మృతి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో బిసగోని గంగయ్య ఇంటి ఆవరణలో బుధవారం మంచినీళ్ల బావిలో పడి వేదాన్స్ (3) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మంతెన శిరీషా-రంజిత్ దంపతుల చిన్న కుమారుడైన వేదాన్స్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో మృతి చెందాడు. కొద్దిసేపటికి బాలుని ఆచూకీ కోసం గాలిస్తుండగా బావిలో శవమై తేలాడు.

సంబంధిత పోస్ట్