ధర్మపురి మండలం గాదెపల్లిలో ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెందిన అర్గుల లలిత(29) అనే వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొన్నేళ్లుగా పోటీ
పరీక్షలు రాస్తున్న లలిత, తన తోటివారు ఉద్యోగాల్లో స్థిరపడటంతో ఆందోళనకు గురయ్యేవారని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి ఆమె సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలి తల్లి లింగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.