జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రం-1లో శుక్రవారం చిన్నారులకు సర్పంచి కాశట్టి వీరేశం ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మూడు నుండి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రమ, తల్లులు ఉన్నారు.