జమ్మికుంట పట్టణంలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఒక మహిళ తీవ్ర ఎండకు ఆయాసానికి గురై కిందపడిపోయింది. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్టీ కార్యకర్తలు వెంటనే స్పందించి ఆమెకు ప్రథమ చికిత్స అందించడంతో కోలుకుంది.