జగిత్యాల: టికెట్లు జెండా మోసినోళ్లకా.. గెలుపు గుర్రాలకా..?

386చూసినవారు
జగిత్యాల: టికెట్లు జెండా మోసినోళ్లకా.. గెలుపు గుర్రాలకా..?
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే జగిత్యాల బల్దియా రాజకీయ రంగం వేడెక్కింది. టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడంతో, ఈసారి జగిత్యాల మున్సిపాలిటీలో రాజకీయ పోరు కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్గా మారింది. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో, జగిత్యాల జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలైంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండగా, ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడంతో సమీకరణాలు మారాయి. పార్టీలోని సీనియర్ నేతలు కూడా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. సామాజిక వర్గాల లెక్కలతో కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్