గురువారం ఎస్సారెస్పీ కాలువలో గల్లంతైన మెట్‌పల్లి డీడీ నగర్‌కు చెందిన అంకుశ్ మృతదేహం శనివారం కోరుట్ల మండలం గుమ్లాపూర్ శివారులో లభ్యమైంది. పెద్దాపూర్ శివారులో యువతి లావణ్యతో కలిసి అంకుశ్ కాలువలో గల్లంతైనట్లు తెలిసింది. పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా అంకుశ్ మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. యువతి కోసం గాలింపు కొనసాగుతోంది.