కౌన్సిలర్ టికెట్ కోసం పార్టీల మార్పు!

1696చూసినవారు
కౌన్సిలర్ టికెట్ కోసం పార్టీల మార్పు!
జగిత్యాల జిల్లా కోరుట్లలో కౌన్సిలర్ టికెట్ కోసం ఒక నాయకుడు ఉదయం ఒక పార్టీలో చేరి, రాత్రికి మరో పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. తోట గంగాధర్ అనే నాయకుడు కోరుట్ల పట్టణంలోని 8వ వార్డు నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. టికెట్ లభించదని భావించి, గురువారం ఉదయం భారాస ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ సమక్షంలో భారాసలో చేరారు. అయితే, కాంగ్రెస్ నాయకులు రాత్రికి అతన్ని తిరిగి పార్టీలోకి చేర్చుకొని, 8వ వార్డు అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సంఘటన స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది.

సంబంధిత పోస్ట్