జాబితాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

1581చూసినవారు
జాబితాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు, ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న గొల్లపల్లి మండలం తిరుమలపురం గ్రామానికి చెందిన మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్