జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్. ఐ. ఆర్. ) -2026 కార్యక్రమంలో భాగంగా, జగిత్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లకు అవగాహన కల్పించడానికి, ఎన్యూమరేషన్ ఫారం నింపడంపై సందేహాల నివృత్తి కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు శుక్రవారం తెలిపారు. ఓటర్లు తమ ఓటరు జాబితాలో నమోదైన వ్యక్తిగత వివరాలు, బీఎల్‌వో, బీఎల్‌వో సూపర్‌వైజర్, ఏఈఆర్ఓల వివరాలను తెలుసుకోవచ్చు.