మల్యాల మండలం ముత్యంపేట (కొండగట్టు) తుమ్మ చెరువు ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి అధికారుల కళ్లుగప్పి, గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లతో మట్టిని తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల చెరువు ఆకృతి దెబ్బతింటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.