జగిత్యాల: బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా: జీవన్‌రెడ్డి (వీడియో)

870చూసినవారు
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. జగిత్యాలలో కేటీఆర్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తుకు పాటుపడొచ్చని తెలిపారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని, శేష జీవితంలో కేసీఆర్‌తో పనిచేసే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు ఓటేసినా, రెండేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్