తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం మీడియాపై అసభ్యకరమైన, అనుచితమైన భాషను ఉపయోగించి పాత్రికేయులను అవమానించిన నేపథ్యంలో, భవిష్యత్తులో ఆయన పాల్గొనే ప్రెస్ మీట్ లు, కార్యక్రమాల కవరేజ్‌ను బహిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్లా శాఖ, జగిత్యాల ప్రెస్ క్లబ్ లు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఆదివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి ఈ విషయాన్ని తెలిపారు.