జగిత్యాల: భారీ వర్షం.. కొత్త కారుపై కూలిన గోడ(వీడియో)

1592చూసినవారు
రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లాలో సోమవారం అర్థరాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అయితే ఈ వర్షం కారణంగా ఓ భవనం రెండో అంతస్తు పైనుంచి గోడ కూలింది. అది కాస్త భవనం పక్కన పార్క్ చేసిన కొత్త కారుపై పడింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసం అయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్