కేసీఆర్ మరమనిషి అయితే ఇంకెవరు హృదయం ఉన్న మనుషులు? అని మాజీమంత్రి జీవన్ రెడ్డి కవితను ప్రశ్నించారు. శనివారం పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్‌పై కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. 'ఈరోజు అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి.. ఆయన పాలన బాగుందా తల్లి? తెలంగాణ ఉద్యమ నాయకుడిని పట్టుకొని మరమనిషి అని కవిత అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.
కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కవిత నాయకురాలిగా ఎదిగారు' అని అన్నారు.