అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

1చూసినవారు
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
చిట్టాపూర్ గ్రామానికి చెందిన చిన్నోళ్ల శంకర్ (42) అనే వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు మల్లాపూర్ ఎస్సై అనిల్ తెలిపారు. ఇంటి నిర్మాణం, అనారోగ్య సమస్యల కారణంగా లక్షల్లో అప్పులు చేసిన శంకర్, బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లి మూడు నెలల క్రితం తిరిగి వచ్చారు. శుక్రవారం రాత్రి భోజనం తర్వాత బయటికి వెళ్లి, శనివారం ముత్యంపేట చక్కెర పరిశ్రమ క్వార్టర్స్ లోని చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు. అప్పులు తీరకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

సంబంధిత పోస్ట్