జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు అమ్మవారి ఆలయంలో బీభత్సం సృష్టించారు. ఆలయ పరిసరాల్లోని గద్దెలను పగలగొట్టి విధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. దుండగులను కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుధీర్ రావు, పోలీస్ సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.