కొండగట్టుకు పోటెత్తిన అంజన్న భక్తులు

1006చూసినవారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు, హనుమాన్ దీక్షాపరుల తాకిడి నెలకొంది. చిన్న జయంతి ఉత్సవాలు సమీపిస్తున్నందున దీక్షా స్వాములు అధిక సంఖ్యలో కొండకు చేరుకుని స్వామివారి సేవలో తరిస్తున్నారు. దీంతో క్యూ లైన్లు, ఆలయ పరిసరాలు స్వాములతో, భక్తులతో సందడిగా మారాయి. చిన్న జయంతి ఉత్సవాలకు ఈవో అంజనా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్