గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

973చూసినవారు
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
జమ్మికుంట పట్టణ శివారులోని కాకతీయ డిజి స్కూల్ వెనుక వాగు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గురువారం మధ్యాహ్నం మేకలను మేపుకుంటూ వెళ్లిన ఎండీ సల్మాన్ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతిచెంది కొన్ని రోజులు అయి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతుడి వివరాలను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సానిటరీ ఇన్స్పెక్టర్ పర్ల మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్