తాటి చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

1642చూసినవారు
తాటి చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికుడు సుధగోని సుదర్శన్ గౌడ్ (58) బుధవారం ఉదయం తాటి చెట్టెక్కి కల్లు దింపే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలవడంతో వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడిని సర్పంచ్ అలువాల శంకర్ పరామర్శించి, నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సుదర్శన్ గౌడ్ ను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం, గౌడ సంఘం నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్