కరీంనగర్: కలెక్టర్ కాళ్లపై పడిన మహిళ

211చూసినవారు
కరీంనగర్: కలెక్టర్ కాళ్లపై పడిన మహిళ
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా తమ సమస్యను పట్టించుకోవడం లేదని పోరండ్లకు చెందిన కర్ర లక్ష్మి అనే వృద్ధురాలు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ చిత్రామిశ్రా కాళ్లపై పడి వేడుకుంది. తన భర్త రాజిరెడ్డి నాలుగేళ్ల క్రితం మృతి చెందారని, అతని పేరున ఉన్న మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరుపై నమోదు చేయాలని కోరింది. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదని, తనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని, వారికి ఎవరికీ అభ్యంతరం లేదని ఆమె కలెక్టర్కు వివరించింది.

సంబంధిత పోస్ట్