హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లి గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు స్పాట్ లోనే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు కరీంనగర్ లక్ష్మీపూర్కు చెందిన కళ్లెం శ్రీనివాస్, తూర్పాటి భార్గవ్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.