ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

2978చూసినవారు
ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఫేక్ కాల్స్ పట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్‌పల్లి ఎస్సై పబ్బా కిరణ్ కుమార్ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ తన పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫేక్ కాల్స్ చేస్తూ “తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమని, ఫోన్‌పే ద్వారా నగదు పంపాలని” కోరుతున్నట్లు కొందరు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రజలతో ముఖ్యంగా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. ఎవరైనా తన పేరుతో లేదా ఇతర అధికారుల పేరుతో డబ్బులు పంపాలని కోరితే వెంటనే నమ్మకుండా సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్