పారిశుద్ధ కార్మికుల పాదాలను శుద్ధి చేసి సత్కరించిన కౌన్సిలర్

2586చూసినవారు
పారిశుద్ధ కార్మికుల పాదాలను శుద్ధి చేసి సత్కరించిన కౌన్సిలర్
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల సుపరిపాలన దినోత్సవాల సందర్భంగా, 14వ వార్డు కౌన్సిలర్ ధోనికెల శిరీష నవీన్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు ఘన సత్కారం జరిగింది. వారి పాదాలను నీటితో శుద్ధి చేసి, కొత్త దుస్తులు అందించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల పాత్ర కీలకమని పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్ అన్నారు.

సంబంధిత పోస్ట్