జగిత్యాల: కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

1200చూసినవారు
జగిత్యాల: కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఘటనలో, అడవి మృగాల నుంచి పంటను కాపాడుకునేందుకు విద్యుత్ తీగలు అమర్చే క్రమంలో సబ్బని గణేష్ (36) అనే వ్యక్తి కరెంట్ షాక్ తో మృతి చెందాడు. రాజేశ్వరరావుపేట గ్రామానికి చెందిన గణేష్, అక్కవత్తుల వినోద్, కోట సురేష్ లతో కలిసి తమ మక్కతోటల్లో బల్బులు బిగించే ప్రయత్నం చేయగా, 11 కేవీ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ప్రమాదకరమైన విద్యుత్ తీగలకు తగిలి షాక్ కు గురయ్యాడు. మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి భార్య లహరి ఫిర్యాదు మేరకు వినోద్, సురేష్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. నవీన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్