జగిత్యాల: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొడుకు మృతి

1229చూసినవారు
జగిత్యాల: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొడుకు మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తొలి మున్సిపల్ చైర్మన్ ఎర్రోళ్ల హన్మండ్లు యాదవ్ కుమారుడు, 30 ఏళ్ల ఎర్రోళ్ల వంశీ యాదవ్ శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసంలో అకస్మాత్తుగా మృతి చెందారు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిన వంశీ యాదవ్ అకాల మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు మెట్పల్లిలో అంత్యక్రియల్లో పాల్గొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్