జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ గ్రామ శివారులో చిన్నోళ్ల శంకర్ (45) అనే యువకుడు శనివారం తెల్లవారుజామున చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు ఆరా తీశారు. మృతుని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.