జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని 14వ వార్డు న్యూ బోయవాడ అంగన్వాడి కేంద్రంలో శనివారం సీమంతం, అన్నప్రాసన మరియు టి హెచ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ ధోనికెల శిరీష నవీన్ పాల్గొని గర్భిణీలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన నిర్వహించి, బాలమృతం ఉపయోగాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ ప్రతిభ, టీచర్ రజిని, వార్డు ఎంఎల్‌హెచ్‌పి మేడం చంద్రకళ, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ సభ్యులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.