జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో సోమవారం,
బీజేపీ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు ఉండడాన్ని ఆయన వ్యతిరేకించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గాంధారి శ్రీనివాస్, మల్యాల మారుతి, ప్రశాంత్, భాస్కర్ పాల్గొన్నారు.