యువత మత్తుకు బానిస కావద్దు: మంత్రి

3చూసినవారు
యువత మత్తుకు బానిస కావద్దు: మంత్రి
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు స్మారకార్థం ఏర్పాటు చేసిన కోరుట్ల ప్రీమియర్ లీగ్ 2026 సెషన్ 6 క్రికెట్ టోర్నమెంట్ ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. క్రీడలు శరీర దారుఢ్యాన్ని, యువతలో స్నేహభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన అన్నారు. యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఇది చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్