ఇల్లంతకుంట మండలం ముస్కాన్ పేట గ్రామంలో గురువారం ఓటరు నమోదు ప్రక్రియను మానకొండూర్ శాసనసభ్యుడు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. గ్రామాన్ని సందర్శించిన ఆయన, ఓటరు నమోదు తీరును పరిశీలించడమే కాకుండా, ఎన్యుమరేటర్లకు ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల
కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు వూట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె అయిలయ్య, ఐరెడ్డి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.