పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఐసిపిఎస్ కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకునేలా చూడాలని, వారిని పూర్తిస్థాయిలో గుర్తించి విద్య అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంక్షేమ శాఖ జాబితాను ఆమోదించి కేజిబీవీలు, గురుకులాలలో సీట్లు కేటాయించాలని సూచించారు.