పెద్దపల్లి జిల్లా మంథనిలోని గౌతమేశ్వరుని దేవాలయం పుష్కర్ ఘాట్ వద్ద కార్తీక మాసం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, గౌతమేశ్వరుని శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు రాచర్ల తిరుమల, రేపాల ఉమాదేవి, ఇతర ఆర్యవైశ్య మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.