బాలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

3చూసినవారు
బాలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్
పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, బాలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సలయ్, అంగన్వాడీ సేవలు, ప్రీ-ప్రైమరీ విద్య, బాలల సదనాల ద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ప్రతి బాలుడికి నాణ్యమైన విద్య, సముచిత పోషకాహారం, సురక్షిత వాతావరణం పొందే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు.