పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు విగ్రహానికి చిల్లపల్లి సర్పంచ్ గోపు సంతోష్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.