స్వచ్ఛ గావ్- సురక్షిత జలవాయు ప్రచారం పకడ్బందీగా నిర్వహించాలి

2చూసినవారు
స్వచ్ఛ గావ్- సురక్షిత జలవాయు ప్రచారం పకడ్బందీగా నిర్వహించాలి
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో స్వచ్ఛ గావ్, సురక్షిత జలవాయు కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ ఆవరణలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, జూన్ 5వ తేదీ వరకు నిర్వహించాల్సిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను వివరించారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, సుస్థిర జీవనశైలిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్