పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావుతో కలిసి మాట్లాడుతూ, పెద్దపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని, నూతన ఐటీ పార్కును మంజూరు చేస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అరకొరగా నిర్మించి లబ్ధిదారులకు అందించలేదని విమర్శించారు.