మంథనిలోని పలు పాఠశాలలను సందర్శించిన డీఈవో శారద

2505చూసినవారు
మంథనిలోని పలు పాఠశాలలను సందర్శించిన డీఈవో శారద
పెద్దపల్లి జిల్లా విద్యాశాఖాధికారి శారద, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డా. పి. ఎం. షేక్ మంథని మండలంలోని ఎంపీపీఎస్ గౌతమీనగర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ FLN, LIP కార్యక్రమాల అమలును పరిశీలించి, విద్యార్థులకు స్పాట్ అసెస్‌మెంట్ నిర్వహించి వారి అభ్యాస స్థాయిని అంచనా వేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి, బోధన నాణ్యత, అభ్యాస ఫలితాల మెరుగుదలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి లక్ష్మి, సీఆర్‌పీలు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్