జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతుల ధాన్యంలో ఎలాంటి కటింగ్ చేయొద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యత పరిశీలించిన ధాన్యాన్ని మాత్రమే రైస్ మిల్లులకు తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కటింగ్ చేయవద్దని అధికారులకు సూచించారు.