పెద్దపల్లి జిల్లా, మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవాన్నిబుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులను శాలువాలతో సన్మానించి, కేక్ కట్ చేశారు. సూపరిండెంట్ డాక్టర్ టీవీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణలో వైద్యుల సేవలను ప్రశంసించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. లయన్స్ క్లబ్ సభ్యులు కూడా వైద్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, హెడ్ సిస్టర్ వినయకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.