డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తిరిగి అప్పగింత: కలెక్టర్ ప్రశంస

పెద్దపల్లి జిల్లాకు చెందిన వరహగిరి శైలజ, వెంకటరావు దంపతులు సోమవారం కలెక్టరేట్ లో ప్రభుత్వంచే మంజూరైన డబుల్ బెడ్ రూమ్ గృహాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు స్వచ్ఛందంగా తిరిగి అప్పగించారు. తమ పిల్లలు సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో స్థిరపడినందున తమకు ఈ గృహం అవసరం లేదని, దీనిని వేరే నిరుపేద కుటుంబానికి కేటాయించాలని కోరారు. ప్రభుత్వ ఆస్తిని తిరిగి అప్పగించిన శైలజ దంపతుల నిజాయితీని కలెక్టర్ ప్రశంసించారు.
