మొక్కజొన్న రైతులకు ప్రభుత్వ భరోసా: కలెక్టర్

385చూసినవారు
మొక్కజొన్న రైతులకు ప్రభుత్వ భరోసా: కలెక్టర్
మొక్కజొన్న పండించిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కనీస మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయడానికి జిల్లాలో ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం తెలిపారు. పెద్దపల్లి, పొత్కపల్లి, రేగడి మద్దికుంట, ధర్మారం, జూలపల్లి తదితర ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, రైతుల అవసరాలను బట్టి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్