పెద్దపల్లి జిల్లా మంథనిలో కరీంనగర్ నుండి మంథని మార్గంలో బస్సుల సమయపాలనపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్య బస్సులు లేకపోవడంతో, 5:45కు వచ్చిన బస్సులో ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎక్కాల్సి వచ్చిందని, ఇది ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. గంట లేదా అరగంట వ్యవధిలో బస్సులు నడిపితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని, ఈ రూట్లో మరిన్ని బస్సులు నడపాలని వారు కోరుతున్నారు.