జూన్ 2 నాటికి ఇందిరా మహిళా శక్తి భవనం ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి మండలం రాఘవపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న భవన పనులను ఆయన పరిశీలించారు. మహిళా సంఘాలకు సొంత భవనం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మిస్తోందని, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తామని తెలిపారు. భవనంలో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, సమావేశాల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.