మంథని పురపాలక సంఘం ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటి సాయంత్రంతో ముగియనుంది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, 13 వార్డులకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల పరిశీలన జనవరి 31న, అప్పీళ్ల పరిష్కారం ఫిబ్రవరి 2న, నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి 3న జరుగుతుంది. అదే రోజు తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. దీంతో మంథనిలో ఎన్నికల సందడి నెలకొంది.