మంథని రేణుక ఎల్లమ్మ చైర్మన్ గా తాటి బాలయ్య గౌడ్

1147చూసినవారు
మంథని రేణుక ఎల్లమ్మ చైర్మన్ గా తాటి బాలయ్య గౌడ్
పెద్దపల్లి జిల్లా మంథని రేణుక ఎల్లమ్మ దేవాలయం చైర్మన్‌గా తాటి బాలయ్య గౌడ్, డైరెక్టర్లుగా కొండ్ర శ్రీనివాస్ గౌడ్, శివయ్య గౌడ్, ఆర్ల వసంత, పూజారిగా మాచిడి మంజుల నరేష్‌లను రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం నియమించారు. ఈ నియామకంపై మంథని గౌడ సంఘం అధ్యక్షుడు మాచిడి వీర శంకర్ గౌడ్, సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పొన్నం చంద్రబాబు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్