పెద్దపల్లిలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి పి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించిందని, ఈ జాబ్ మేళా నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కూడా పాల్గొన్నారు.