యువత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి పోలీస్ ఉద్యోగాల సాధనపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో పెద్దపల్లి యువశక్తి మెగా మాక్ టెస్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా యువత పోలీస్ విభాగంలో ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సన్నద్ధం కావడానికి ఈ మెగా మాక్ టెస్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.